రాఫేల్ రాక ఆలస్యం

రాఫేల్ రాక  ఆలస్యం

న్యూ ఢిల్లీ : లాక్డౌన్ వల్ల రాఫేల్ యుద్ధ విమానాల రాక మరికొన్ని వారాల ఆలస్యం కానుందని భారతీయ వాయు సేన వర్గాలు తెలిపాయి. తొలి ఒప్పందం ప్రకారం మొదటి విడత రాఫేల్ విమానాలు మే చివరికల్లా భారత్కు చేరాలి. లాక్డౌన్ పూర్తయిన అనంతరం వాటి పంపిణీ తేదీలు ఖరారు అవుతాయని అధి కారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విమానాల్నినడపటంలో భారత వాయుసేన పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన నలుగురు పైలట్లు యుద్ధ విమానాలు నడపటంలో కీలక పాత్ర పోషిస్తారని ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాకేశ్కుమార్ సింగ్ భదౌరియా తెలిపారు. 2016లో రూ.60,000 కోట్ల వ్యయంతో 36 రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ ప్రభుత్వం, దసాల్ట్ ఏవియేషన్, భారత ప్రభుత్వం మధ్యం ఒప్పందం కుదిరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos