రచితా తనేజాపై కోర్టు ధిక్కరణ కేసు

రచితా తనేజాపై కోర్టు ధిక్కరణ  కేసు

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టును విమర్శించినందుకు గాను కార్టూనిస్ట్ రచితా తనేజాపై కోర్టు ధిక్కరణ చర్యల కింద కేసు నమోదు చేసేందుకు అటార్నీ జనరల్ కెకె. వేణుగోపాల్ అనుమతినిచ్చారు. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులపై వరుసగా ఆమె ట్వీట్లు చేశారు. ఇది అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించడమే. నిర్లక్ష్యంగా దాడికి పాల్పడటం. న్యాయస్థానాన్ని దూషించడమ’న్నారు. రిపబ్లిక్ టివి ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంపై శానిటరీ పానెల్స్ పేరుతో కార్టూనిస్ట్ రచితా తనేజా విమర్శించారు. దీంతో ఆమెపై కోర్టు ధిక్కరణ చర్యల కింద కేసు నమోదు చేయాలంటూ న్యాయశాస్త్ర విద్యార్థి ఒకరు దాఖలు చేసిన వ్యాజ్యానికి అనుమతి లభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos