లాభాల్లో విపణి

లాభాల్లో విపణి

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారమూ లాభాల్ని గడించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి39,298 వద్ద,నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 11,661వద్ద ఆగాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 71.14గా నమోదైంది. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్100 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 32పాయింట్లతో ట్రేడింగ్ మొదలు పెట్టింది. విదేశీ మదుపరులు కొనుగోళ్లకు సుముఖత చూపటంతో విపణి పుంజుకుంది. మొత్తం 1585 షేర్లు లాభపడగా, 925 షేర్లు నష్టాలను చవి చూశాయి. 169 షేర్లలో ఎలాంటి మార్పులేదు. యస్ బ్యాంకు, కోల్ఇండియా, అదానీ పోర్ట్స్, గ్రాసి మ్, మారుతీ సుజుకీ తదితర షేర్లు లాభపడ్డాయి. జీ ఎంటర్టైన్మెంట్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, హిందాల్కో షేర్లు నష్ట పో యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos