ఖైదీలే ఎఫ్‌ఎం జాకీలు..

ఖైదీలే ఎఫ్‌ఎం జాకీలు..

వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అంటూ ఖైదీలు ఎఫ్‌ఎం రేడీయో జాకీలుగా మారి తోటి ఖైదీలను,జైలు సిబ్బందికి వినోదాన్ని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జైలులో ప్రారంభించిన రేడియో ఎఫ్‌ఎంలో జాకీలుగా మారిన ఖైదీలు పలు ఆసక్తికర విషయాలు చెబుతూ తోటి ఖైదీలను ఉత్సాహపరుస్తూ వినోదాన్ని అందిస్తున్నారు. ఉదయం భక్తిగీతాలతో ప్రారంభం కానున్న ఈ రేడియో ఎఫ్ఎం, మధ్యలో వార్తలు, ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఇతర సమాచారాన్ని అందించనున్నారు.ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎం రేడియో ఖైదీల్లో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి నూతనోత్సాహాన్ని నింపేందుకు ఎఫ్‌ఎం ఎంతగానో తోడ్పడుతుందని ఎఫ్‌ఎం రేడియోను ప్రారంభించిన సబ్‌జైలు అధికారి వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.ఎఫ్‌ఎం నిర్వహణ కోసం ఐదుగురు ఖైదీలకు జాకీలుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos