కరోనా చావులను ఎవరూ ఆపలేరు

కరోనా చావులను ఎవరూ ఆపలేరు

భోపాల్: మధ్య ప్రదేశ్లో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండడంపై రాష్ట్ర మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వయసు పైబడిన తర్వాత మనుషులు చనిపోతారు కదా’ని నిర్లక్ష్యంగా మాట్లాడారు. కరోనా మృతులపై విలేఖరులడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు. ‘ఈ చావులను ఎవరూ ఆపలేరు. కరోనా నుంచి రక్షించుకునేందుకు సహకరించాలంటూ ప్రతిఒక్కరూ మాట్లాడుతున్నారు. ప్రతి రోజూ చాలామంది చనిపోతున్నారు అని మీరు అడుగుతున్నారు. ప్రజలు వయసు పైబడితే చనిపోక తప్పదు కదా.. ’’ అని పేర్కొన్నారు. బుధ వారం మధ్యప్రదేశ్లో 9,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు నిన్న ఒక్కరోజే కరోనాతో 51 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్-19 మృతుల సంఖ్య 4,312కి చేరింది. ఈ ఒక్క నెల లోనే మధ్య ప్రదేశ్లో కొత్తగా 67,841 మందికి కరోనా సోకగా… 326 మంది చనిపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos