మాలేగాం పేలుళ్ల కేసులో ప్రగ్యా ఠాకూర్ పాత్ర

మాలేగాం పేలుళ్ల కేసులో  ప్రగ్యా ఠాకూర్ పాత్ర

ముంబయి : 2008 లో మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో జరిగిన బాంబు పేలుళ్ల తో భోపాల్ బీజేపీ లోక్సభ సభ్యురాలు ప్రగ్యాసింగ్ ఠాకూర్ కు సంబంధం ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణుల బృందం తేల్చి చెప్పింది. మాలేగావ్ మసీదులో జరిగిన పేలుడు స్థలంలో పేలుడు పదార్థాలు ఉంచిన ఒక ఎల్ఎంఎల్ వెస్పా స్కూటరు పోలీసులకు లభించింది. ఈ ఎల్ఎంఎల్ వెస్పా స్కూటర్ భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ పేరుపై రిజిస్టర్ చేసి ఉందని ఫోరెన్సిక్ నిపుణులు ముంబయిలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు నివేదించారు. ఈ పేలుళ్ల కేసులో 261 మంది సాక్షులను ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు విచారించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos