పవన్‌పై పూనమ్‌ మరో ట్వీట్‌..

పవన్‌పై పూనమ్‌ మరో ట్వీట్‌..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీనటి పూనమ్ కౌర్ మరోసారి పరక్షంగా విమర్శలు గుప్పించింది.కోపాన్ని ప్రదర్శించడం శక్తికి సూచిక కాదు అనేలా టాలీవుడ్ నటి పూనం కౌర్ ట్వీట్ చేసి మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.కొద్ది కాలంగా పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ పూనమ్ ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆదివారం విశాఖపట్టణంలో పవన్ పిలుపునిచ్చిన లాంగ్‌మార్చ్‌లో ఉద్వేగభరింగా ప్రసంగించారు.ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఈ రోజు మరో ట్వీట్ చేసింది. ‘ఆగ్రహం అంటే పవర్ కాదు’ అని పేర్కొంది. దీంతో ‘పవర్’ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు పూనమ్‌పై కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. వైసీపీకి ఎప్పుడు అమ్ముడుబోయావు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘నీకు బుద్ధి ఉంటే ఎవరి గురించి ట్వీట్ చేస్తున్నావో వారి పేర్లను కూడా రాయి’ అని ఒక రిప్లై ఇచ్చారు. ‘బాగా చెప్పారు మేడం. అయితే, మీ ట్వీట్ లో తీవ్రత కాస్త తగ్గింది’ అని మరొకరు రిప్లై ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos