రాజకీయాల్లోకి ఇప్పుడు కాదు…

రాజకీయాల్లోకి ఇప్పుడు కాదు…

హైదరాబాద్ : తాను రాజకీయాల్లోకి రావడానికి ఇది సరైన సమయం కాదని, అలాగే ఇది సందర్భమూ కాదని టాలీవుట్ స్టార్ హీరో నందమూరి ఎన్టీఆర్ అన్నారు. తాజాగా మరోసారి బుల్లితెరపై ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్ ప్రోమో విడుదల కార్యక్రమంలో ‘రాజకీయ ప్రవేశం ఎప్పుడు?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ పైవిధంగా సమాధానం ఇచ్చారు. ‘ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో కూడా మీకు బాగా తెలుసు. ఇది సరైన సమయం కాదు. సందర్భమూ కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబ్లు చెప్పుకుందాం.’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos