‘పీఎం నరేంద్రమోదీ’ 24న విడుదల

‘పీఎం నరేంద్రమోదీ’ 24న విడుదల

న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం ‘పీఎం నరేంద్రమోదీ’ ఎట్టకేలకు ఈ నెల 24న విడుదల కానుంది. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు థియేటర్లలో ప్రదర్శితం కానుంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయ దలచారు. అంతకు ముందు రోజు కేంద్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలను నిలిపేసింది. విపక్షాల అభ్యంతరాల ఇందుకు కారణం. బయోపిక్‌‌లు ఎన్నికలఫలితాల్ని ప్రభావితం చేయనున్నందున ఎన్నికలు ముగిసేంత వరకూ రాజకీయ నేతలకు సంబంధించిన బయోపిక్‌లు విడుదల చేయరాదని ఆదేశించింది. దీన్ని నిర్మాతలు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడినమరుసటి రోజు 2019 మే 24న సినిమాను విడుదల చేస్తామని నిర్మాత సందీప్ సింగ్ శుక్రవారం ఇక్కడ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos