బీహార్లో కొత్త రాజకీయ పక్షం ప్లూరల్స్

బీహార్లో కొత్త రాజకీయ పక్షం ప్లూరల్స్

పాట్నా: జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) సీనియర్ నాయకుడు వినోద్ చౌధరి కుమార్తె, లండన్కు చెందిన పుష్పమ్ ప్రియా చౌధరి సొంతంగా రాజకీయ పక్షం – ప్లూరల్స్ ప్రారంభించారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. బిహార్ అభివృద్ధి కోసం ప్రజలంతా తనతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. తాను ముఖ్యమంత్రినైతే 2025 నాటికి బిహార్ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చి దిద్దు తానని హామీ ఇచ్చారు. ‘ఆమె మేజర్.. చదువుకున్న అమ్మాయి. రాజకీయాల్లోకి రావడమనేది పూర్తిగా ఆమె నిర్ణయమే. అయితే, సీఎం నితీశ్ కుమార్కు పోటీగా బరిలోకి దిగుతానంటే మాత్రం పార్టీగానీ, నేను గానీ ఎప్పటికీ మద్దతివ్వను’ అని ఆమె తండ్రి వినోద్ చౌధరి తెలిపారు. దర్భంగాకు చెందిన ప్రియా చౌధరి లండన్లో స్థిర పడ్డారు. యూనివర్శిటీ ఆఫ్ ససెక్స్ నుంచి డెవలప్మెంట్ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos