ఇలా చేస్తే కాంగ్రెస్‌ దే గెలుపు

ఇలా చేస్తే  కాంగ్రెస్‌ దే గెలుపు

న్యూ ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ 2024లో బీజేపీని సవాలు చేసే స్థాయికి ఎదుగుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయ పడ్డారు. ఇందుకోసం ఏక తాటిపైకి రావడం ముఖ్యమన్నారు. కాంగ్రెస్ ఆ పనిని ఇప్పుడే ప్రారంభిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని సవాలు చేయగలిగే స్థాయికి ఎదుగుతుందని ఇండియా టుడే ముఖా ముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ).. పార్టీలో నెలకొన్న సంస్థాగత బలహీనతలను పరిష్కరించడంతోపాటు పార్టీ నిర్మాణంలో సమగ్ర మార్పులు చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియాకు పూర్తి అధికారం ఇచ్చింది.‘బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు, కేరళ వంటి తూర్పు, దక్షిణ భారతదేశంలోని దాదాపు 200 స్థానాల్లో 50 కంటే ఎక్కువ సీట్లను సాధించేందుకు ఇప్పటికీ పోరాడుతోంది. కాంగ్రెస్కు పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని ఆత్మ, ఆలోచనలు, భావజాలం అలానే ఉండాలి. మిగతావన్నీ కొత్తగా ఉండాలి. గాంధీ కుటుంబం కాంగ్రెస్ను విడిచిపెట్టినా ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ తన ప్రాథమ్యాల్ని సరిచేయాల్సిన సమయం ఇదే. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అడ్డదారులు లేవు. 10-15 ఏళ్ల దృక్కోణంతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గమ’ని తేల్చి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos