బీజేపీ అధికారంలోకి వస్తే…నా సంస్థను మూసేస్తా

బీజేపీ అధికారంలోకి వస్తే…నా సంస్థను మూసేస్తా

కోల్కతా : ‘తృణమూల్ కాంగ్రెస్సే తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. లేక పోతే వేరే వృత్తిలోకి వెళ్లిపోతాన’ని ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భరోసా వ్యక్తం చేసారు. ‘వంద సీట్ల కంటే బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా. నా సంస్థను కూడా మూసేస్తా. ఈ వృత్తి మాత్రం చేయను. పూర్తి భిన్నమైన వృత్తిని చేపడతా. ఈ రోజు ఉన్నట్టు ఉండను. మరోసారి రాజకీయ ప్రచార వేదికలపై మీకు నేను కనిపించను’ అని  వ్యాఖ్యా నిం చారు. ‘యూపీలో తమ పాచికలు పారలేదని మాకు స్వేచ్ఛ కల్పించలేదు. బెంగాల్లో అలా లేదు. పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తృణమూల్ తనంతట తాను బలహీన పరుచు కుంటే తప్ప బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి ఉండదు. అధికార తృణమూల్లో అంతర్గత వైరుధ్యాలు పుష్కలంగా ఉన్నాయి. రాజకీయంగా ఆ లొసుగులను బీజేపీ సమ ర్థంగా వాడుకుంటోంది. తృణమూల్ నుంచి బీజేపీలోకి నేతలు వలసలు వెళ్లడం కూడా బీజేపీ వ్యూహంలో భాగం. అనేకానేక కారణాలతో నేతలను బెదిరిస్తున్నార’ని ఆరో పించారు. ‘పార్టీ నేతలందర్నీ స్నేహితులుగా మార్చుకోడానికి నేను లేను. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమన్న ధ్యేయంతోనే పనిచేస్తున్నా. ఈ పనిచేస్తున్న సందర్భంలో కొందర్ని పట్టించుకోవడం లేదన్న బాధ వారిలో ఉంది. అది వారిష్టం.’’ అని ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos