ప్రధానికి ఉండాల్సింది పెద్ద మనస్సు ..ఛాతీ కాదు

ప్రధానికి ఉండాల్సింది పెద్ద మనస్సు ..ఛాతీ కాదు

న్యూఢిల్లీ: మహాకూటమి అధికారంలోకి వస్తే, ప్రధాని ఎవరనే విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీమాంతర విభాగ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తెలిపారు. శనివారం ఇక్కడ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని వ్యక్తి గతంగా తాను కోరుకుంటున్నానని చెప్పారు. ‘రాహుల్ యువతరానికి చెందినవారు. ఉన్నత విద్యను అభ్యసించారు. తెలివైనవారు. గత దశాబ్ద కాలంగా ఆయన ఎంతో నేర్చుకున్నారు. ఏది చేస్తే ప్రజలకు చాలా మంచి జరుగుతుందో ఆయనకు తెలుసు. గత రెండు, మూడు ఏళ్లలో రాహుల్ వచ్చిన గణనీయమైన మార్పును అందరూ చూశారు. రాహుల్ గొప్ప నాయకుడనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేద’న్నారు. దేశానికి 40లలో లేదా 50లలో ఉన్న వ్యక్తి ప్రధాని కావాలని… 60 ఏళ్లు దాటినవారు అవసరం లేదని చెప్పారు. మన దేశ జనాభాలో 65 కోట్ల మంది 25 ఏళ్ల లోపు వారే. దేశానికి యువ నాయకత్వం కావాలని చెప్పారు. ప్రధానికి హుందాతనం, ఇతరులను గౌరవించే వ్యక్తిత్వం, పెద్ద మనసు ఉండాలని… పెద్ద ఛాతీ అవసరం లేదని మోదీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos