మరింత పారదర్శక పాలన కోసం గ్లోబల్ టెండర్లు

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరింత పారదర్శక, సమర్థవంత పాలన అందించడానికి సమాయత్తమ య్యారు. ‘ఈ-ఆఫీస్, ఈ-ఫైల్ విధానాలను విస్తరించడం ద్వారా కేరళలో పరిపాలనను మరింత సమర్థవంతం, పారదర్శకం చేస్తాం. దీనిని అమలు చేయడానికి గ్లోబల్ టెండర్ పిలుస్తాం. ఇది సెప్టెంబరు 30 కల్లా పూర్తవుతుంది’’ అని పినరయి విజయన్ ట్వీట్ చేశారు. ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించడంతో పినరయి విజయన్ రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణం చేసారు. మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి స్థానం కల్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos