ఆకలిలో ఎవ్వరూ అలమటించరాదు. అందరికీ ఆహారాన్నిస్తాం

తిరువనంతపురం:కరోనా కట్టడిలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలించిన కేరళ కరోనా రెండో దాడిలోనూ తన ప్రజా సేవను లోకానికి చాటి చెప్పింది. ఇతర పార్టీ ప్రభుత్వాల కంటే తమది విభిన్నమైనది,మానవతకు పెద్ద పీట వేసినదిగా కేరళ వామపక్ష ప్రభుత్వం రుజువు చేసింది. ఎనిమిది రోజుల పూర్తి లాక్ డౌన్ విధించినందున కరోనా రోగులు అందరికి ఉచితంగా ఆహారాన్ని వారి ముంగిటే అందించనున్నట్లు ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ శనివారం ఇక్కడ పరకటించారు. ‘కరోనా రెండో దాడి చాలా బలంగా ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆహారం కోసం ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదదు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంద’ ని భరోసా ఇచ్చారు. ఆహారం, నిత్యావసరాలు, పళ్లు, కాయగూరలు, డెయిరీ ప్రాడక్ట్స్, మాంసం, చేపలు, జంతువుల దాణా, పౌల్ట్రీ, బేకరీలు తెరిచే ఉంటాయి. అయితే అన్ని షాపులు సాయంత్రం 7.30 కల్లా మూసి వేయాలి. ‘రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు. అన్ని బాధిత కుటుంబాలకు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచిత ఆహారాన్ని అందిస్తారు. స్థానిక ప్రభుత్వ సంస్థలు, ప్రజా రెస్టారెంట్లు, కమ్యూనిటీ కిచెన్స్ ద్వారా ఆహారాన్ని అందజే స్తామ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos