ఆర్థికమంత్రి లేని ఆర్థిక వేత్తల భేటీ

ఆర్థికమంత్రి లేని ఆర్థిక వేత్తల భేటీ

న్యూఢిల్లీ : వచ్చే బడ్జెట్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ముఖ్య ఆర్థికవేత్తలతో జరిపిన సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ లేకపోవడం చర్చనీయాంశమైంది. బడ్జెట్ తయారీ, నిధుల కేటాయింపు, ఆర్థిక వ్యవస్థ మందగమనం తదితర అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, నీతి అయోగ్ ప్రతినిధులు, పలువురు ఆర్థికవేత్తలు పాల్గొన్నారు.దీనిపై ‘దేశంలో ఏమి జరుగుతోంద’ని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు శశిథరూర్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ‘కీలకమైన సమావేశానికి ఆర్థికమంత్రి లేకపోవడం ఏమిటి? అసలిక్కడ ఏం జరుగు తోంద’ని ప్రశ్నించారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 ఏడాదికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos