విజేతల్ని చులకన చేయటం తగదు

విజేతల్ని చులకన చేయటం తగదు

న్యూఢిల్లీ: నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. ‘సొంత పనులు మానేసి ఇతరుల విజయాలను చులకల చేసి మాట్లేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత -అభిజీత్ బెనర్జీ నిజాయితీగా తన పని తాను చేశారు. బహుమతి గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. మీ (భాజపా నేతలు) పని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం. కామెడీ సర్కస్ చేయడం కాద’ని ట్వీట్లో చురకలంటించింది. పండుగ కాలం – సెప్టెంబర్లోనూ ఆటో మొబైల్ రంగం లో మందగమనం కొనసాగుతోంద నే వార్త కథనాన్ని కూడా జత చేశారు. ప్రముఖ ఆర్థిక వేత్త ఆచార్య అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి లభిం చటం అభినందనీయమన్న పీయూష్ గోయెల్ ఆయన్ను వామ పక్షవాదిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పథకమైన ‘న్యాయ్’ను అభిజిత్ సమర్ధించినా భారతీ యులు ఆయన భావజాలాన్ని తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవ స్థ సమీప భవిష్యత్తులో పుంజుకునే అవకాశం లేద’ని బెనర్జి ఇటీవల విశ్లేషించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos