ప్రజాప్రతినిధులపై 132 కేసులు పెండింగ్

న్యూ ఢిల్లీ : ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు కార్యా చరణ రూపొందిస్తున్నాయి. తన కార్యాచరణ ప్రణాళికను, నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పిం చారు. దేశ వ్యాప్తంగా 4,859 కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రజాప్రతినిధులపై మొత్తం 132 కేసులు, పది కేసులు సెషన్స్ ,22 కేసులు మేజిస్ట్రేట్ కోర్టుల్లో ఉన్నాయి. జిల్లాకో మేజిస్ట్రేట్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టులను విశాఖ, కడపలో ఏర్పాటు చేయనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos