చిదంబరం ప్రతిష్టను దిగ జార్చేందుకే…

న్యూ ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రతిష్టను దిగజార్చేం దుకే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బుధవారం ఇక్కడ ట్విట్టర్లో ఆరోపించారు. ఇందుకు సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థలను మోదీ సర్కార్ వాడు కుంటోందని మండి పడ్డారు. మోదీ ప్రభుత్వం అధికార దుర్విని యోగానికి పాల్పడి ఇలాంటి చర్యలకు దిగ టాన్నిఖండించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో అభియోగాల్ని ఎదిరిస్తున్న చిదంబరం దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ వినతిని మంగళవారం ఢిల్లీ హై కోర్టు కొట్టివేసింది. దీనిపై బుధవారం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. మంగళ వారం రాత్రి నుంచి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos