ఐటీ నోటీసులు అన్ని పార్టీలు, ప్రజలకు ఓ హెచ్చరిక

ఐటీ నోటీసులు అన్ని పార్టీలు, ప్రజలకు ఓ హెచ్చరిక

చెన్నై : ఆదాయ పన్ను శాఖ (ఐటి) కాంగ్రెస్కు ఇచ్చిన నోటీసులు దేశంలోని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజలకు ఇచ్చిన అతిపెద్ద హెచ్చరిక అని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను నాశనం చేయడమే బిజెపి ఉద్దేశమని అన్నారు. పుదుకొట్టారులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్లతో కమలం పార్టీ రూ.8,250 కోట్లు దోచుకున్నప్పటికీ.. బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్పై రూ.135 కోట్ల జరిమానా విధించిందని అన్నారు. బిజెపి అన్ని పార్టీలను నాశనం చేయాలనుకుంటుందని, రాజకీయ పార్టీలకు, ప్రజలకు ఇది ఓ హెచ్చరిక అని అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అన్నాడిఎంకె ఎన్డిఎ కూటమిలో చేరుతుందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos