డేటా లేనపుడు రైతులకు కనీస మద్దతు ధర ఎలా ఇస్తారు

డేటా లేనపుడు  రైతులకు కనీస మద్దతు ధర ఎలా ఇస్తారు

న్యూఢిల్లీ: ప్రభుత్వం వద్ద ప్రైవేటు వాణిజ్యానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేనప్పుడు రైతులకు కనీస మద్దతు ధర ఎలా ఇస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం ప్రశ్నించారు. ‘దేశం అంతటా ప్రతిరోజూ వేలాది గ్రామాల్లో రూ.కోట్ల ప్రైవేటు లావాదేవీలు జరుగుతాయి. ఏ రైతు ఏ వ్యాపారికి ఏ ఉత్పత్తులను అమ్మారో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను ప్రశ్నించారు. దరిమిలా ప్రభుత్వం ఎలా ప్రణాళికలు వేస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. ‘రైతుకు చెల్లించే ధర మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉంటోంది. రైతుల పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ చెబుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదు? దీన్ని గుడ్డిగా నమ్మేందుకు రైతులు మూర్ఖులు అని మంత్రి ప్రభుత్వం భావిస్తోందా ? సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. ప్రతి భారతీయుడి ఖాతాలో15 లక్షలు రూపాయలు వేస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారాట? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం సంగతి ఏమిటి? ’అని నిలదీశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos