కమలంతో పొత్తెందుకు నితీశ్‌?

కమలంతో పొత్తెందుకు నితీశ్‌?

పాట్నా: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపాతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ఆ పార్టీ నేత, జనరల్ సెక్రటరీ పవన్ కె వర్మ ప్రశ్నించారు. ఇది తనను కలవరపరుస్తోందని నితీశ్కు రాసిన లేఖను ట్వీట్తో జత పరిచారు. ‘భాజపా-ఆర్ఎస్ఎస్ గురించి మీరు చాలా సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. భాజపాకు ఎంతో కాలం గా మిత్ర పక్షంగా ఉంటున్న అకాళీ దళ్ ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేయడం లేదు. బిహార్ను దాటి ఢిల్లీలో భాజపాతో జేడీయూ ఎందుకు పొత్తు పెట్టుకుందో అర్థం కావడం లేదు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ పట్ల దేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్త మ వు తున్న దశలో ఇది ఎందుకు? ఆర్ఎస్ఎస్ ముక్త్ భారత్ తీసుకురావాలని మీరే పలుమార్లు పిలుపు నిచ్చారు. మోదీ తీసు కునే నిర్ణయాలు దేశానికి హాని కలిగిస్తున్నాయని చాలా సార్లు విమర్శించారు. అయినా మీరు 2017లో భాజపాతో మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీ పట్ల మీకున్న భయాలు మాత్రం పోవడం లేదు కదా’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos