పవన్ ఓ అజ్ఞాని

పవన్ ఓ అజ్ఞాని

కడప: కొంత కాలంగా కనుమరుగైన పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మళ్లీ బయటకు వచ్చాడని వైకాపా అధికార ప్రతినిధి సి. రామ చంద్రయ్య ఎద్దేవా చేసారు.గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. బాబు సూచనల ప్రకారమే రోజుకో వేషంతో వైకాపాను తప్పుబడుతున్నారని మండి పడ్డారు. ‘చంద్ర బాబు బినామీ కల్యాణ్, రాజకీయ అజ్ఞాని. ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టారు. తెదేపా హయాంలో అవినీతి జరుగు తుంటే నిద్రపోయాడు. గత ఎన్నికల్లో బాబుకు అనుకూలంగా వామ పక్షాలతో కలిసి ప్రచారం చేసారు.  ఇప్పుడు ఆయన సూచనలతోనే భాజపా చంకనెక్కాలని చూస్తున్నాడు. ప్రజా భిమానం లేక రెండు స్థానాల్లో ఘోర పరాజయం చెందావు. నీవు, నీ స్థానం ఏంటో తెలుసుకొని మాట్లాడ’ని హితవు పలికారు. కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నించి జగన్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పట్ల అవహేళనగా మాట్లాడతావా?ని ఆగ్ర హించారు. కులాలను అడ్డు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది ఎవరని తిరిగి ప్రశ్నించారు. గతంలో ఇంగ్లీష్లో ట్వీట్లు పెట్టినప్పుడు తెలుగు చచ్చిపోయిందా? అంటూ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంపై పవన్ చేసిన అనవసర రాద్ధాంతాన్ని కొట్టిపారేశారు. రేపిస్టులకు రెండు చెంప దెబ్బలు చాలని అనడం సిగ్గుచేటని, వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అవగాహన లోపంతో చేస్తున్నారనేది బయట పడుతుందని అభిప్రాయ పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos