సమాంతర జాతీయ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించాలి

సమాంతర జాతీయ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించాలి

ముంబై: కరోనా బారి నుంచి దేశాన్ని రక్షించడంలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైనందున కరోనా కట్టడికి ప్రత్యేక కార్యచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు నానా పటోలె బుధవారం సుప్రీం కోర్టుకు విన్నవించారు. మోదీ సర్కార్ వైఫల్యం దృష్ట్యా సమాంతర జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ కోరారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. సమాంతర జాతీయ ప్రభుత్వం ఏర్పాటునకు రాజ్యాంగంలో వెసలు బాటు ఉందని వివరించారు. ‘ఆడమన్నట్టు ఆడే కీలుబొమ్మగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తయారయ్యారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై విమర్శలు చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. గాంధీ కుటుంబం లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కోసం రూ.20,000 కోట్లు ఖర్చుపెడుతున్నారు. టీకాలకు కు అవసరమైన నిధులు మాత్రం ఇవ్వడం లేద’ని ధ్వజ మెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos