పతంజలిపై చట్టపరమైన చర్యలు

ముంబై: పతంజలి సంస్థ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కరోనా నివారణిగా కరోనిల్ మందు తయారుచేసినట్లు ప్రకటనలు చేసిన పతంజలి సంస్థపై చర్యలు తప్పవు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రానిదే మహారాష్ట్రలో అమ్మాలని చూసినా, ప్రచారం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామ’న్నారు. 150కి పైగా ఔషధ మొక్కలతో మేము తయారు చేసిన కరోనిల్ మాత్రలు వేసుకుంటే వారం రోజుల్లో కరోనా పూర్తిగా తగ్గిపోతుందని రెండ్రోజుల కిందట బాబా రాందేవ్ ప్రకటించారు. కరోనిల్ తీసుకున్న వారిలో ఒక్కరూ చనిపోలేదని, వంద శాతం కోలుకున్నారని చెప్పారు. కరోనిల్ మాత్రలు వేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos