మమతా బెనర్జీకి షాకిచ్చిన టీఎంసీ ప్రధాన కార్యదర్శి

మమతా బెనర్జీకి షాకిచ్చిన టీఎంసీ ప్రధాన కార్యదర్శి

కోల్కత్తా : పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో నిందితుడు పరిశ్రమల మంత్రి, పార్థా చటర్జీని మంత్రి వర్గం నుంచి తొలగించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి ,మాజీ ఎంపీ కూన ల్ ఘోష్ చేసిన ట్వీట్ ముఖ్యమంత్రి మమతను ఇరకాటంలోకి నెట్టింది. పార్థా ఛటర్జీని పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని డిమాండు చేసారు. ‘ఆయనను కచ్చితంగా బహి ష్కరించాలి. ఒకవేళ నేను చేసిన ఈ డిమాండ్లో తప్పు ఉందని అనిపిస్తే నన్నూ టీఎంసీ నుంచి తొలగించేందుకు పార్టీకి అన్ని విధాలా హక్కు ఉంటుంద’ని ట్వీట్ లో పేర్కొ న్నారు. కూనల్ ట్వీట్ చూసిన కొందరు నెటిజన్లు ఒక దొంగ మరో దొంగను పార్టీ నుంచి తొలగించమని డిమాండ్ చేస్తున్నాడని వెటకారం చేశారు. కూనల్ ఘోష్ శారదా చిట్ఫండ్ స్కాంలో 34 నెలల పాటు జైలు జీవితం గడిపారు. అక్టోబర్ 5, 2016న బెయిల్పై ఈ మాజీ ఎంపీ బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. పార్థా ఛటర్జీ విష యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. పార్టీ సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుం టుందని టీఎంసీ ముఖ్య నేత ఒకరు మాత్రం మీడియాకు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos