ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై విపక్షాల ఆందోళన

ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై విపక్షాల ఆందోళన

న్యూ ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల్లో మంగళ వారం ధరలు, ద్రవ్యోల్బణాల పెరుగుదలకు నిరసనగా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసించటంతో రెండు ఉభయ సభలూ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. సభా కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే.. ధరల పెరుగుదల, అగ్నిపథ్ పథకంపై చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ ఇతర, ప్రతి పక్షాలు డిమాండు చేసారు. దీంతో రాజ్యసభలో కాసేపు గందర గోళం నెలకొంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే 267 నిబంధన ప్రకారం సంబంధిత అంశాలపై చర్చ జరపాలని నోటీసులు ఇచ్చారు. దీన్ని ఛైర్మన్ తిరస్కరించటంతో సభ్యుల నిరసనకు దిగారు. ఎగువసభను 2 గంటలకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర విపక్ష సభ్యులు కొన్ని కొత్త వస్తువులపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకంగా నినాదాలు రాసిన అట్టల్ని సభా మధ్య భాగంలో ప్రదర్శించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభాపతి ఓం బిర్లా విపక్ష సభ్యులను తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. సభలో నినాదాలు రాసిన అట్టల ప్రదర్శన నిబంధనలకు విరుద్ధమన్నారు. తదుపరి సభను రెండు గంటలకు వాయిదా వేసారు. .అంతకుముందు పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై విపక్షాలు ఆందోళన చేసాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos