చర్చల్లేకుండానే చట్టసభలు వాయిదా

చర్చల్లేకుండానే చట్టసభలు వాయిదా

న్యూ ఢిల్లీ: చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నందుకు పార్లమెంటులో విపక్షాలు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించాయి. . లోక్సభ లో ప్రశ్నోత్తరాలు చేపట్టి నపుడు విపక్ష సభ్యుల ప్రసంగాలను ప్రసార మాధ్యమాల్లో ఎందుకు సరిగా ప్రసారం చేయడం లేదని కాంగ్రెస్ పక్ష నేత అధీర్రంజన్ చౌదరి నిలదీశారు. విపక్షాలు చేసే గొడవలను ఎలా ప్రసారం చేస్తామని స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎదురు ప్రశ్నించారు. అనంతరం చమురు ధరలపై విపక్షాలు ఆందో ళనకు దిగగా లోక్సభ తొలుత 12 గంటల వరకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు రైతు చట్టాలు, చమురు ధరలపై ఆందోళన కొనసాగిం చాయి. దీంతో ప్యానెల్ స్పీకర్ మీనాక్షి లేఖి సభను 2గంటల వరకు వాయిదా వేశారు. అనంతర సభ మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో సభ బుధ వారా నికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ చమురు ధరలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ 12గంటల వరకు ఒకసారి, 2 గంటల వరకు మరో సారి వాయిదా పడింది. అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాలు పట్టు విడవలేదు. దీంతో సభ బుధవారానికి వాయిదా పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos