సర్ఫరాజ్‌ కు పాక్ బోర్డు మద్దతు

సర్ఫరాజ్‌ కు పాక్ బోర్డు మద్దతు

ఇస్లామాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సఫారీ ఆల్‌రౌండర్‌ ఆండిల్‌ పెహ్లువాకియాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సర్పరాజ్‌ అహ్మద్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం సర్ఫరాజ్‌కు మొదటి నుంచి మద్దతునిస్తుంది. సర్ఫరాజ్‌ చేసింది తప్పైనప్పటికీ.. అతనిపై నిషేధం విధించడం సరికాదని వాదనలు వినిపిస్తుంది. అయితే ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను కొనసాగిస్తుందా.. లేక మరెవరికైన ఆ అవకాశాన్ని ఇస్తుందా..? అనే సందేహాలు సోషల్‌‌మీడియాలో కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. అయితే పాకిస్థాన్ బోర్డు ఈ సందేహాలకు చెక్ పెడుతూ.. ప్రపంచకప్‌లో సర్ఫరాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ‘‘సర్ఫరాజే మా కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ సిరీస్ తర్వాత మీడియా నిరూపించలేని ఎన్నో ఘటనలు జరుగుతాయి. కాబట్టి అతను ప్రపంచకప్‌కి ముందు ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో, ప్రపంచకప్‌లో జట్టును కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అతను పాకిస్థాన్ జట్టు కోసం ఎంతో చేశాడు’’ అని పాక్ బోర్డు ఓ పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos