పాక్ ఆంక్షలు ఎయిర్‌ ఇండియాకు నష్టాలు

న్యూఢిల్లీ: జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం దాడి పర్యవసానంగా తమ గగనతలం మీదుగా భారత విమానాల రాక పోకల పై పాక్ విధించిన ఆంక్షల వల్ల ఎయిర్‌ ఇండియా రూ.మూడు వందల కోట్ల వరకూ నష్టపోయింది. పాక్ తమ గగనతలాన్ని మూసి వేయడంతో భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల్లో అమెరికా, ఐరోపాలకు విమానాల్ని నడిపాయి. వీటి ప్రయాణ దూరం సాధారణ మార్గం కంటే ఎక్కువ. సిబ్బంది వినియోగం కూడా పెరిగింది. దీంతో రోజుకు రూ. 6కోట్లు చొప్పున ఎయిరిండియా రూ. 300 కోట్లకు పైగా నష్ట పోయినట్లు ఒక నివేదిక పేర్కొంది. నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎయిరిండియా పౌర విమానయాన శాఖను ఆశ్రయించి నష్ట పరిహారం కోరినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos