అప్పటి ఉపకారానికి ఇప్పుడు ప్రత్యుపకారం….

అప్పటి ఉపకారానికి ఇప్పుడు ప్రత్యుపకారం….

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా తెరాస నేత పద్మారావుగౌడ్‌ సోమవారం
బాధ్యతలు స్వీకరించారు.ఇతర పార్టీలు ఉపసభాపతి ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో
అధికార తెరాస పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన పద్మారావుగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే
పద్మారావు ఏకగ్రీవ ఎన్నికపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన మనసులో మాట బహిర్గతం చేసారు.ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభలో ఉపసభాపతి స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసినపుడు అప్పటి
అధికార కాంగ్రెస్‌ పార్టీ సహకరించలేదని అయితే తమ అభ్యర్థిత్వానికి విపక్షస్థానంలో ఉన్న
తెరాస సహకరించడంతో ఉపసభాపతిగా ఎన్నికయ్యామని గుర్తు చేసుకున్నారు.అందుకు ప్రతిగా పద్మారావుగౌడ్‌
ఏకగ్రీవానికి తాము సహకరించామంటూ వ్యాఖ్యానించారు.డిప్యూటీ స్పీకర్ నోటిఫికేషన్ వచ్చి
.. టీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావుగౌడ్ అభ్యర్థితం ఖరారు కాగానే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. శనివారం స్వయంగా సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు.
పద్మారావు గౌడ్ అభ్యర్థిత్వానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గతంలో తాము సహకరించిన
విషయాన్ని గుర్తుచేయడంతో కాంగ్రెస్ నేతలు అంగీకరించి .. పోటీకి అభ్యర్థిని నిలుపలేదు.
తాను గతంలో ఉప సభాపతిగా పనిచేసిన సమయంలో హుందాగా పనిచేశానని చర్చ సందర్భంగా చెప్పారు
భట్టి విక్రమార్క. అధికార, విపక్ష పార్టీలు అనే తేడా లేకుండా చూశానని, మీరు కూడా అలాగే
వ్యవహరించాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైందని
ప్రత్యేకంగా ప్రస్తావించారు భట్టి విక్రమార్క.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos