ముస్లిం వ్యతిరేకులకు హిందూ ప్రభుత్వ మద్దతు

ముస్లిం వ్యతిరేకులకు హిందూ ప్రభుత్వ మద్దతు

హైదరాబాదు : ముస్లిం సమాజంపై ద్వేష భావం హిందుత్వ నుంచి వచ్చిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేరగాళ్లకు హిందూ ప్రభుత్వ మద్దతు ఉందని ఆరోపించారు. ‘ముస్లింలపై దాడులకు పాల్పడేవారు హిందువులు కారని మోహన్ భగవత్ అంటున్నారు. అయితే ముస్లిం లకు వ్యతిరేకంగా నేరాలు చేస్తున్న వారికి అధికార పార్టీ మద్దతు ఇస్తోందనే విషయం అందరికీ తెలుసు. గో రక్షకుల పేరుతో ఎందరో ముస్లింలపై దాడులు జరిగాయి. 20 15లో మొహమ్మద్ అఖ్లఖ్ హత్య, 2017లో పెహ్లూ ఖాన్ పై దాడి, 2018లో అలీముద్దీన్ మృతి వంటివి ఈ దారుణాలకు కొన్ని ఉదాహరణలు. అలీముద్దీన్ ను చంపిన నేరస్థులను ఒక కేంద్ర మంత్రి పూలదండలతో సత్కరించార’ని ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos