ఆదాలచే పోలీసులకు ఓ ఆర్ ఎస్ ఎస్ వితరణ

ఆదాలచే పోలీసులకు  ఓ ఆర్ ఎస్ ఎస్ వితరణ

నెల్లూరు: లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి  మంగళవారం నెల్లూరు ట్రాఫిక్ పోలీసులకు ఓఆర్ఎస్ డ్రింకులను , షర్బత్ బాటిళ్లను  పంపిణీ చేశారు.  ఎన్ ఎం డి  చారిటీస్ అధినేత నిజాముద్దీన్ నెల్లూరు ట్రాఫిక్ పోలీసుల కోసం గానూ ఓ ఆర్ ఎస్ పానీయాలను సర్బత్  బాటిళ్లను ఆదాల ప్రభాకర్ రెడ్డి చేత అందించారు ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జున రావు సీఐలు కె  వేణు రెడ్డి  మధుబాబు వీటిని అందుకున్నారు  ఎండలు అధికంగా ఉన్న ఈ పరిస్థితుల్లో  కష్టపడి పనిచేస్తున్న నెల్లూరు ట్రాఫిక్ పోలీసులకు శీతల పానీయాల ద్వారా వారి ఆరోగ్యాన్ని క్రమ బద్దీక రించేందుకు కృషి చేయడం అభినందనీయమని ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి  అన్నారు  నిజాముద్దీన్ తన వ్యాపారంలో వచ్చిన లాభంతో ఈ మంచి పని  చేయడం మంచి పరిణామమని, ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని కోరారు . మా సిబ్బందికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతులమీదుగా వీటిని   అందజేయడం అభినందనీయమని డీఎస్పీ  మల్లికార్జున రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి  ఎన్  ఎం డి చారిటీస్ ని, ఆ సేవలు చేస్తున్న నిజాముద్దీన్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో మల్లు సుధాకర్ రెడ్డి, పాముల హరి, అవినాష్, చంద్రమోహన్ రెడ్డి ,మధు , నరసింహారావు తదితరులు పాల్గొన్నారు .

పలువురి ప్రశంసలు అభినందనలు

ఆదాల ప్రభాకర్ రెడ్డికి మంగళవారం అధికార, వ్యాపార రాజకీయ వర్గాల ప్రశంసలు అభినందనలు అందాయి. ప్రముఖ వ్యాపార సంస్థ ఎంజి బ్రదర్స్ అధినేత గంగాధర్ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు అందజేశారు. ఆయనతోపాటు మల్లి, లేకిన్  రెడ్డి  ఉన్నారు  డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగేంద్ర కుమార్ ,హెచ్డీ విజయ్ కుమార్ లు కూడా ఆయనను అభినందించారు.  ఇందు  జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి సభ్యులు సుందర రామయ్య మౌళి సుబ్బ నాయుడు తదితరులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్ ఇతర అధికారులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు  మీ సేవ అసోసియెషన్   రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.అనిల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరు బిషప్ తరఫున ఫాదర్ పెడతల జోసెఫ్, చిరమన కరుణాకర్ ,కాయల సురేష్ తమ శుభాకాంక్షలు దీవెనలు అందజేశారు నెల్లూరు జిల్లా లారీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిన్నారెడ్డి  ఇతర కార్యవర్గ సభ్యులు నారాయణ ఖదీర్  శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఎక్సైజ్ సీఐ నరహరి తమ అభినందనలు తెలిపారు వీరితో పాటు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు అభి మానులు నేతలు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి  తమ శుభా శీస్సులు అందజేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos