తెరుచుకున్న థియేటర్లు

తెరుచుకున్న థియేటర్లు

హైదరాబాదు : సినిమా థియేటర్లు శుక్రవారం నుంచి తెరుచుకున్నాయి. హీరో సాయితేజ్ తన స్నేహితులతో కలిసి ప్రసాద్ ఐమ్యాక్స్కు వెళ్లి హాలీవుడ్ సినిమా-టెనెట్ చూసాడు. సంబంధిత వీడియోనూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.‘ ప్రతి ఒక్కరూ తిరిగి థియేటర్లకు రావాలి. చాలాకాలం తర్వాత థియేటర్కు రావడం సంతోషంగా ఉంది. వెండితెరపై సినిమాని చూడడమే అద్భుతమైన వినోదం. నా లాగే చాలామంది భావిస్తారు. థియేటర్కు వచ్చేముందు తప్పకుండా మాస్క్లు ధరించండి. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాల’ని చెప్పాడు. దర్శకుడు మారుతి కూడా ప్రసాద్ ఐమ్యాక్స్కు వెళ్లి సినిమా చూశారు. ‘మేము థియేటర్లకు రావడం చూస్తే మళ్లీ మా జీవితాల్లోకి మేము వచ్చేసినట్లు అనిపిస్తుంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos