నేతి బీరకాయ ఊరట

నేతి బీరకాయ ఊరట

న్యూ ఢిల్లీ: కరోనా పీడిత దేశంలోని మధ్యతరగతి, బడుగు వర్గాలను ఆదుకునే ఉద్దేశం పాలకులకు లేదని మరో రుజువైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం చేసిన ప్రకటనలే ఇందుకు సాక్ష్యాలు. అత్యధికులు చెల్లించేనెల సరి బ్యాంకు వాయిదాలను ఏ మాత్రం సడలించ లేదు. రుణాల రీ షెడ్యూలింగ్ ఊసేత్తలేదు. 2018-2019 ఆదాయపు పన్ను పత్రాల దాఖలు గడువును జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. చెల్లింపు వడ్డీ రేటును 12 నుంచి 9 శాతానికి తగ్గించారు. ఆధార్-పాన్ కార్డు అనుసంధాన గడువును జూన్ 30 వరకూ, మార్చి, ఏప్రిల్, మే 2020 జీఎస్టీ (వస్తుసేవల పన్ను) రిటర్న్లు, కంపోజిషన్ రిటర్న్ల దాఖలు గడువును కూడా జూన్ 30 వరకూ పొడిగించారు. ఎగుమతులు, దిగుమతులకు ఊరట కలిగిస్తూ, కస్టమ్స్ క్లియరెన్స్ను జూన్ 30 వరకూ నిత్యావసర సేవగా పరిగణిస్తారు. ఏటీఎంలో నగదు విత్డ్రాలు మూడు నెలల పాటు ఎలాంటి చార్జీలు ఉండవు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos