తెలుగువారి పౌరుషాన్ని చాటిచెప్పింది ఆ ఇద్దరే..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెరాస పార్టీ కార్యాలయాలు,నేతలు,కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌లోని తెరాస కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొని మాట్లాడారు.తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తులు కేవలం ఇద్దరే ఇద్దరి మొదటి వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి తారకరామావు కాగా రెండవ వ్యక్తి తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు.తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ అద్భుత ఫలితాలు రాబట్టారని.. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాజకీయాల్లోకి వచ్చారని.. అయితే ఎన్టీఆర్ తో పోలిస్తే అనేక సవాళ్లను కేసీఆర్ ఎదుర్కొన్నారని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉందని ఎన్టీఆర్ సినిమా స్టార్ కావడంతో… అప్పట్లో ఆయనకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని అన్నారు. కానీ కేసీఆర్ కు ఎలాంటి అనుకూలతలు లేవన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని 2001లో కేసీఆర్ ఒంటరిగా మొదలు పెట్టారన్న కేటీఆర్.. 71 ఏళ్ల తెలంగాణ చరిత్రలో ఉద్యమం కోసం ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయని.. కానీ గట్టిగా నిలబడిన పార్టీ టీఆర్ ఎస్ ఒక్కటేనని కేటీఆర్ అన్నారు. తాను ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టండని ఆనాడు కేసీఆర్ చెప్పారని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్లలో అన్నీ ప్రతికూల పరిస్థితులే ఏర్పడ్డాయని కేటీఆర్ చెప్పారు. 2001 నుంచి 2019 వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణవాదులు సైనికుల్లా పోరాటం చేశారని కొనియాడారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos