హామీల అమలులో జగన్ దూకుడుకు కారణం ఇదేనా!

 కేంద్రంలో వేగంగా మారుతున్న రాజకీయాలతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.ఒకేదేశం ఒకే ఎన్నికల నినాదంతో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు.అందుకు దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సుముఖత వచ్చే పార్లమెంట్ మావేశాల్లోనే మిలి ఎన్నిక బిల్లును ప్రవే పెట్టాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఇది ఆమోదం పొందింతే 2022 చివర్లో లేదా 2023లో దేశ వ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకే సారి నున్నాయి.ఇదే అంశం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన జమిలి ఎన్నికలకు అంగీకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలు ఎట్టిపరిస్థితుల్లోరూ నెరవేర్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జమిలి ఎన్నికల బిల్లుకు సమావేశాల్లో ఆమోదముద్ర లభిస్తే ఎన్నికలకు కేవలం మూడేళ్ల సమయం మాత్రమే ఉంటుందని భావించిన జగన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.అందులో భాగంగా..ముందుగా హామీల అమలు.. ప్రజా ర్ష కాలకు నిధులు కేటాయింపు ద్వారా ముందుగా ప్రల్లో ఇమేజ్ పెంచుకొనే ప్రత్నం చేస్తున్నారు.అదే యంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి అధికారం దక్కడంలో కీలకంగా మారిన దళిత,వెనుకబడ్డ వర్గాలను తెదేపా దరిచేరనివ్వకుండా కూడా జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత తొలి వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో ఈ విజ‌యంతో బాధ్య‌త పెరిగింద‌ని చెబు తూనే..టార్గెట్ 2024 ల‌క్ష్యంగా ఇప్ప‌టి నుండే ప‌ని చేయాల‌ని జ‌గ‌న నిర్ధేశించారు. మంత్రి ప‌ద‌వుల విష‌యంలోనూ అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఆ త‌రువాతే మార్పులు జ‌రిగాయి. ఢిల్లీ కేంద్రంగా ఆలోచ‌న‌లు..అడుగులు నిశితంగా గ‌మ‌నిస్తూ..ఏపీలో జ‌గ‌న్ వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదముద్ర లభిస్తే మూడేళ్లలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో జగన్‌ దూకుడు ప్రదర్శిస్తున్నట్లు చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుత ప్ర‌భుత్వం ఎంత కాలం ఉన్నా..తిరిగి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకొని విశ్వసనీయత నిరూపించుకున్నాననే అంశంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని భావిస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos