ఓలికి పదవి గండం

ఓలికి పదవి గండం

ఖట్మండు: నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ) స్థాయి సమితి సమావేశం బుధవారం నుంచి శుక్రవారానికి వాయిదా పడింది. ఈ సమావేశం ప్రధాని కేపీ శర్మ ఓలి రాజకీయ భవిష్యత్ను నిర్ణయించనుంది. పార్టీ సభ్యులే పదవికి రాజీనామా చేయాలని ఓలిని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. నేపాల్లో చైనా రాయబారి హో యాంకీ మంగళవారం కూడా అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ) నేతలతో ముమ్మరంగా మంతనాలు జరిపారు. అధికారాన్ని పంచుకునే విషయంలో ఓలికి, అసమ్మతి నేత పుష్ప కమల్ దహాల్ ప్రచండకు మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని నివాసంలో ఓలి, ప్రచండ మరోసారి భేటీ అయ్యారు. ప్రధాని, పార్టీ అధ్యక్ష పదవి.. రెండింటిలోనూ ఓలి ఒక్కరే కొనసాగడాన్ని అసమ్మతి నేతలు నిరసిస్తున్నారు. నేపాల్ వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని నిరసించి చైనా రాయబార కార్యాలయం ఎదుట నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన చేసారు. నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos