పెరగనున్న చమురు ధరలు

పెరగనున్న  చమురు ధరలు

న్యూఢిల్లీ : సౌదీ అరేబియా నిల్వలపై యెమెన్ హౌతి తిరుగుబాటుదార్లు శనివారం దాడి చేయటంతో చమురు సరఫరా ఆగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు సోమవారం హెచ్చరించారు. చమురు ధరలు పెరగకుండా అడ్డుకునేందుకు తక్షణమే దేశీయ చమురు నిల్వలను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రభావం రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఉండబోదని భావిస్తున్నారు. మంటల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోయిన సౌదీ అరేబియా చమురు సంస్థ చమురు ఉత్పత్తుల సరఫరాను పునరుద్ధ రించటంపైనే చమురు ధరలు అధార పడి ఉంటాయని నిపుణుల లెక్కాచారం. ఇప్పడూ అక్కడి చమురు నిల్వల నుంచి పొగ వెలువడుతూనే ఉంది. ‘సౌదీపై ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇప్పటికే గుర్తించాం. వారిపై ప్రతీకార దాడి జరిపేందుకు ఆయుధాలు లోడ్ చేసి పెట్టుకున్నాం. సౌదీ అనుమతివ్వటమే తరువాయి దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ప్రోత్సాహంతో హౌతి తీవ్రవాదులు దాడికి చేసారని అంతర్జాతీయ సమాచార సంస్థలు తెలిపాయి. ఇరాన్యే ఈ దాడికి పాల్పడిందని అమెరికా ఆరోపించింది. అంటే ఇరాన్పైనే అమెరికా దాడి చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగేందుకు ఇవీ కారణం కానున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos