కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి..

కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి..

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్న తరుణంలో కశ్మీర అమ్మాయిలపై బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.ఉత్తర్ ప్రదేశ్ లోని ముజప్ఫర్ నగర్ నియోజకవర్గంలో కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ షైనీ మాట్లాడుతూ..తెల్లగా చాలా అందగా ఉండే కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి యువకులు,బీజేపీ పార్టీ కార్యకర్తలు తెగ ఆరాటపడేవాళ్లన్నారు.అయితే గతంలో జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 డీ ఉండడం వల్ల అది సాధ్యం కాకపోయేదని కానీ తాజాగా ఆర్టికల్‌ 370 రద్దు చేయడం వల్ల కశ్మీరీ యువతులను వివాహమాడటానికి లైన్‌ క్లియర్‌ అయిందంటూ వ్యాఖ్యానించారు. ఇక బ్యాచిలర్లు కశ్మీరీ అమ్మాయిలను స్వేచ్ఛగా పెళ్లి చేసుకోవచ్చని, ఎలాంటి అడ్డంకులు ఉండబోవని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ కు చెందిన అందమైన అమ్మాయిలను వివాహమాడటానికి చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. దీనికోసమైనా తాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు కృతజ్నత చెప్పుకోవాలని అన్నారు. బ్యాచిలర్లు తమ బ్రహ్మచర్యాన్ని విడనాడి కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలు కోరుకున్న కాశ్మీరీ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తామని అన్నారు.కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకునే అవకాశం దక్కడం వల్ల తమ పార్టీలో ఎవరైనా ముస్లిం కార్యకర్తలు ఉంటే వారు పండగ చేసుకోవచ్చని అన్నారు. తాను కాశ్మీర్ లో స్థిరపడతానని, అక్కడ ప్రతి ఒక్కరూ అందంగా కనిపిస్తారని చెప్పారు. అందాన్ని అనుభవించడానికైనా తాను జమ్మూ కాశ్మీర్ లో భూమిని కొనుగోలు చేసి, అక్కడే స్థిరపడతానని షైనీ అన్నారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos