కృష్ణగిరి జిల్లాలో జోరుగా నామినేషన్లు

కృష్ణగిరి జిల్లాలో జోరుగా నామినేషన్లు

హొసూరు : రాష్ట్రంలో ఈనెల 27, 31 తేదీల్లో రెండు విడతలుగా జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కృష్ణగిరి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. హొసూరు, కెలమంగలం, తళి, సూలగిరి యూనియన్లలో అధ్యక్ష, కౌన్సిలర్‌, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. హొసూరు యూనియన్‌లోని చెన్నసంద్రం, ముత్తాలి, వన్నలవాడి, ఇచ్చంగురు, బాగలూరు, నల్లూరు తదితర పంచాయతీలలో సర్పంచ్ పదవులకు పోటీ చేయడానికి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులతో హొసూరు యూనియన్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. జిల్లాలోని అన్ని యూనియన్లలో నామినేషన్లు ఊపందుకున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos