భయపడకండి..ప్రజలకు కశ్మీర్ గవర్నర్ సూచన..

భయపడకండి..ప్రజలకు కశ్మీర్ గవర్నర్ సూచన..

కశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అనేక అనుమానాలకు,ఉత్కంఠతకు గురి చేస్తోంది.అమర్నాథ్ యాత్రికులను తిరిగి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో పరిస్థితి మారిపోయింది. మరోవైపు కశ్మీర్లో అదనపు బలగాల మొహరింపుతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్లో ఉగ్రవాదులు దాడులు చేస్తారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వెనక్కి వెళ్లిన సీఆర్పీఎఫ్ బెటాలియన్లు తిరిగి కశ్మీర్ రావాలని ఆదేశాలు జారీచేయడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. ఇప్పటికే కశ్మీర్ వ్యాలీలో కొన్ని బెటాలియన్లు ఉన్నాయని .. అయితే పరిస్థితి సద్దుమణిగిందని కొన్ని వెళ్లిపోయాయి.అమర్ నాథ్ యాత్రికులు లక్ష్యంగా దాడులకు తెగబడతారనే సమాచారంతో యాత్రికుల భద్రత దృష్ట్యా వారిని వెనక్కి పంపిస్తున్నామని తెలిపారు.శత్రుదేశం చర్యలకు ధీటుగా మాత్రమే స్పందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. మరోవైపు కశ్మీర్ కొండల్లో ఉన్న ప్రజలు మాత్రం బిక్కు బిక్కుమంటున్నారు.ఇప్పటికే ఉన్న భద్రత బలగాలకు అదనంగా మరిన్ని భద్రత బలగాలు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. దీంతో ప్రజలు నిత్యావరవస్తువులు,పెట్రోల్‌ బంకులు,ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతోపాటు విమానయాన సంస్థ క్యాన్సిల్ చార్జీలను కూడా తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా విమానయాన సంస్థలు టికెట్ క్యాన్సిల్ చేస్తే చార్జీ వసూల్ చేస్తాయి. కానీ ఈసారి చార్జీ విధించకపోవడం అనుమానాలు కలుగజేస్తోంది. మరోవైపు కశ్మీర్ వ్యాలీలో యాత్రలను కూడా నిషేధించారు. దీంతో కశ్మీర్లో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది.గత నెల 25 కేంద్ర హోంశాఖ 100 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ బలగాలను కశ్మీర్లో మొహరించిన సంగతి తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos