మాట మార్చిన నితీష్

మాట మార్చిన నితీష్

పాట్నా : బిహార్ శాసన సభ ఎన్నికల తుది విడత ప్రచారం సందర్భంగా చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట మార్చారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. ఈ ఎన్నిక తనకు చివరిది కాదని స్పష్టం చేశారు. తాను గత సమావేశంలో పదవీ విరమణ గురించి మాట్లాడలేదని పేర్కొన్నారు. ‘ప్రతీ ఎన్నికల చివరి ర్యాలీలో నేను ‘ముగింపు బాగుంటే, అంతా బాగుంటుంది’ (అంత్ బలా తో సబ్ బలా) అనే మాటతో ముగిస్తాను. దీనిని అస్పష్టంగా అర్థం చేసుకున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా అంకితభావంతో పరిపాలన కొనసాగిస్తాన’’ని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 125 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos