హత్యాచారులకు ప్రాణ భయం

హత్యాచారులకు ప్రాణ భయం

న్యూ ఢిల్లీ: నిర్భయ దోషులకు ప్రాణ భయం పట్టుకుంది. ఉరి భయం వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని తీహార్ చెరసాల అధికారులు తెలిపారు. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తన గదిలో విరామం లేకుండా నడుస్తున్నాడు. గత ఏడేళ్లుగా వారు చెరసాల్లోనే మగ్గుతున్నారు. ఈ వ్యవధిలో దోషులు 23 సార్లు జైలు నిబంధనలను అతిక్రమించారు. శిక్షగా వాళ్లున్న గదిని మార్చడంతో పాటు, అయినవాళ్లతో వారి ముఖాముఖిల్ని తగ్గిస్తారు. వినయ్శర్మకు 11 సార్లు, పవన్కు 8 సార్లు, ముకేశ్కు 3 సార్లు, అక్షయ్కుమార్కు ఒకసారి శిక్షల్ని విధించారు. దోషులు చేసిన రోజువారీ పనులకు వేతనాన్ని చెల్లిస్తారు. అక్షయ్ రూ.69 వేలు, పవన్ రూ.29వేలు, వినయ్ రూ.39వేలు సంపాదించారు. ముఖేశ్ ఏ పనీ చేయకుండా ఉండేవాడు. నలుగురినీ వైద్యులు ప్రతి రోజూ పరీక్షించి వారి మానసిక పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వారి గది కి నలుగురు జవాన్లను కాపలాగా నియమించారు. ఇతర ఖైదీలతో మాట్లాడేందుకు అనుమతి లేదు. ఆ గదిలో ఫ్యాన్ కూడా లేదు. 24 గంటల పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా వారి కదలికలను గమిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos