నిఖిల్ వివాహం పై విచారణ

నిఖిల్ వివాహం పై విచారణ

బెంగళూరు: నగర శివార్లలోని, కేతిగానిహళ్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం ఉదయం జరిగిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ వివాహం గురించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రామ్ నగర్ డిప్యూటీ కమిషనర్ కు ప్రభుత్వం ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో జరిగిన ఈ వివాహానికి నియమావళి కంటే ఎక్కువ మంతి అతిథులు హాజరు కావటం వివాదాస్పదమైంది. ‘ఈ పెళ్లిపై చర్యలు తీసుకోకుంటే, వ్యవస్థను వెక్కిరించినట్లవుతుంద’ని ఉపముఖ్యమంత్రి డాక్టర్ అశ్వర్థనారాయణ వ్యాఖ్యానించారు. ‘జిల్లా ఎస్పీతోనూ మాట్లాడాం. వివాహం జరిపించిన వారిపై చర్యలు తప్పవ’ని స్పష్టం చేశారు. నిఖిల్ గౌడ, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కృష్ణప్ప మనవరాలు రేవతి వివాహం జరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos