కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ లో దావూద్ హస్తం..!

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ లో దావూద్ హస్తం..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కుంభకోణంలో మాజీ దౌత్య ఉద్యోగి స్వప్న సురేశ్ తో పాటు ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం హస్తం కూడా ఉందని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.ఈ బంగారం తరలింపులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పాత్ర ఉందని భావిస్తున్నట్టు ఎన్ఐఈ న్యాయస్థానానికి వెల్లడించింది. బంగారం అక్రమరవాణా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాద కార్యక్రమాలకు, జాతి వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడని నిఘా వర్గాలు సమాచారం అందించాయని ఎన్ఐఏ వివరించింది. నిందితుల్లో ఒకడైన రమీజ్ ను విచారించడం ద్వారా ఎన్ఐఏ కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. కాగా, దౌత్య మార్గాలను బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఉపయోగించుకున్న నిందితులకు బెయిల్ ఇవ్వవద్దని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని కోరింది.ఈ కేసులో ఓ కేరళ మంత్రిపైనా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్ కు స్వప్న సురేశ్ తో సంబంధాలున్నాయని ఆరోపణలు రాగా, ఆయనను పదవి నుంచి తప్పించారు.ఇక కేరళ నుంచి బంగారంను స్మగ్లింగ్ చేసి వాటిని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తారని ఇంటెలిజెన్స్ అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలో విచారణ సాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపితే పెద్ద తలకాయలు బయటపడే అవకాశాలున్నాయని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos