వీవీప్యాట్‌ రశీదుల లెక్కింపు విచారణ వచ్చే వారం

న్యూఢిల్లీ: ఎన్నికల వోట్ల ఫలితాల ప్రకటనకు 50 శాతం వీవీప్యాట్‌ రశీదుల్ని లెక్కించాలని 21 రాజకీయ పక్షాలు దాఖలు చేసిన సమీక్ష వ్యాజ్యంపై విచారణకు అత్యున్నత న్యాయ స్థానం శుక్ర వారం అంగీకరించింది. వచ్చే వారం విచారణ ప్రారంభం కానుంది. త్వరగా విచారణ జరపాలని న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు. ఇది వరకే దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణజరిపిన న్యాయస్థానం ప్రతి నియోజక వర్గంలో ఐదు వీవీప్యాట్ రశీదుల్ని ఈవీఎం ఫలితాలతో పోల్చాలని తీర్పునిచ్చింది. వీవీప్యాట్లలో ని యాభై శాతం రశీదులల్నిలెక్కిస్తే సమయం, సిబ్బంది ఎక్కువ అవసరమవుతాయని, ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం అత్యున్నత న్యాయస్థానానికి మొర పెట్టుకుంది. దరిమిలా అత్యున్నత న్యాయస్థానం ప్రతిపక్షాల్ని ఊరటించేందుకు ఐదేసి వీవీప్యాట్ల రశీదుల్ని లెక్కించాలని తీర్పు నిచ్చింది. దీన్ని మళ్లీ పరిశీలించాలని విపక్షాలు మరో వ్యాజ్యాన్ని దాఖలు చేసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos