ఆక్సిజన్‌ కావాలంటే వీరికి కాల్‌ చేయండి

ఆక్సిజన్‌ కావాలంటే వీరికి కాల్‌ చేయండి

కోల్కతా : అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీలు భారీ ఎత్తున జనాలను పోగు చేసి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. జాగ్రత్తలు తీసుకో లేదు. ఆ ఫలితం ఇప్పుడు జనాలు అనుభవిస్తున్నారు. దరిమిలా రాజకీయ నాయకులకు బుద్ది చెప్పేందుకు పశ్చిమ బెంగాల్ నెటినులు అమలు చేసిన వ్యూహం సంచలనమైంది. ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసి, వైరస్ వ్యాప్తికి కారణమయిన రాజకీయ నాయకులు ప్రసుత్తం కనిపించడం లేదు. దాంతో నెటిజనులు సదరు నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత ఫోన్ నంబ ర్లున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏ సాయం కావాలన్నా వారిని అడగండని కోరారు. ‘కరోనా అంటే భయం ఎందుకు. మన దగ్గర రాజకీయ నాయకులున్నారు. జనాలకు కష్టం వచ్చిందంటే చాలు.. వారు ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా ప్రజల కోసం పాటు పడతారు. మీకు ఆక్సిజన్, రక్తం, మాస్క్, శానిటైజర్, అంబులెన్స్ వంటి సేవలు కావాల్సి వస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫోటోలోని నాయకుల నంబర్కు కాల్ చేయండి’’ అనే మెసేజ్ చేశారు. ఈ ఫోటోల 14 మంది బీజేపీ, టీఎంసీ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత మొబైల్ నంబర్లు ఉన్నాయి. వీరిలో సువేందు అధికారి, బాబుల్ సుప్రియో, రాజ్ చక్రవర్తి వంటి ప్రముఖులు పేర్లు కూడా ఉండటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos