భాజపా భయపడుతోంది

భాజపా భయపడుతోంది

ముంబై: శాసన సభ్యులు చేజారి పోకుండా వారించేందుకు భాజప ప్రభుత్వమే ఏర్పాటవుతుందని నాయకత్వం అసంబద్ధ ప్రకటనల్నిచేస్తోందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాజ్ మాలిక్ శనివారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేకున్నాపార్టీలో చేరిన ఇతర పార్టీల వారిని కాపాడుకోవడానికే భాజపా ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. భాజపాలో గెలిచే అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నారు. ఇతర పార్టీల ప్రభుత్వం ఆరు నెలలకుమించి ఉండదన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ వీస్ చేసిన వ్యాఖ్యలు ఓడిన దేశపు సైన్యా ధ్యక్షుడి ప్రకటనల్ని గుర్తు చేస్తున్నాయని’ పేర్కొ న్నా రు. మహా రాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నాయి. ఎన్సీపి నేత శరద్పవార్ ఆదివారం సోనియా గాంధీతో సమావేశం కానున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos