జెండా తల కిందులు భాజపా నేతపై కేసు

తిరువనంత పురం: నగరంలో ఆదివారం జాతీయ జెండాను తలకిందులుగా ఎగుర వేసిన భాజపా, జాతీయ పతాకాన్ని అవమానించిన మార్క్స్టిస్టు పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోలీసులు కేసులు దాఖలు చేసారు. 75 వ స్వాతంత్ర్య దినోత్స వాన్ని పురస్కరించుకుని భాజపా అధ్యక్షుడు కె. సురేంద్రన్ తమ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగుర వేశారు. కాసేపటికి దీన్ని గమనించి తిరిగి జెండాను సరిచేసి ఎగురవేశారు. అప్పటికే పలువురు స్థానికులు దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అది సంచలనం కావటంతో సదరు నేతపై కేసు నమోదు చేశారు. సీపీఐ (యం) పార్టీ కార్యాలయంలో నేతలు జాతీయ జెండాకు సమానంగా తమ పార్టీ జెండానూ ఎగరేసారు. జెండా నియమావళి ప్రకారం జాతీయ జెండాకు సమానంగా వేరే ఏ పతాకాలు ఉండకూడదు. దీన్ని సీపీఐ (యం) ఉల్లంఘించిందని, దేశ త్రివర్ణపతాకాన్ని అవమానించారని కాంగ్రెస్నేత కె.ఎస్. సబరినాథన్ విమర్శించారు. బీజేపీ నాయకులూ స్పందించారు. సీపీఐ (యం) నేతలపై జెండా నియమావళి ఉల్లంఘన కింద కేసులను నమోదు చేయాలని పోలీ సులను కోరారు. దీనికి పోలీసులు సానుకూలంగా స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos